పీలేరు నియోజకవర్గానికి చెందిన పలువురు మైనార్టీ నాయకులు శుక్రవారం సాయంత్రం ప్రముఖ సినీయాక్టర్, హస్యనటుడు అలీని హైదరాబాదులోని ఆయన స్వగృహంలో మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. ఈ సందర్భంగా అలీ మాట్లాడుతూ సమాజంలో సేవా కార్యక్రమాల అవశ్యకత ఎంతైనా ఉందని, విద్యార్థి దశ నుంచే సేవా భావాన్ని ప్రతి ఒక్కరూ అలవర్చుకోవాలని సూచించారు. వితంతువుల సంక్షేమానికి సేవాకార్యక్రమాల ద్వారా అపన్నహస్తం అందించాలని తమకు సూచించాన్నారు. కలిసిన వారిలో పీలేరు సర్పంచ్ డాక్టర్ షేక్ హబీబ్ బాషా, రాష్ట్ర ఉర్దూ అకాడమీ మాజీ డైరెక్టర్ అబ్దుల్ కలీం, కేంద్ర ఉక్కు కార్పొరేషన్ మాజీ సభ్యుడు కల్లూరు అలీ తదితరులు ఉన్నారు