Atmakur, Sri Potti Sriramulu Nellore | Aug 21, 2025
నెల్లూరు జిల్లా, ఆత్మకూరు నియోజకవర్గం, ఆత్మకూరు మండలం నారంపేట గ్రామంలోని పంట పొలాల్లో పేకాట స్థావరాలపై పోలీసులు దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో 11 మందిని అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి రూ. 5.10 లక్షల నగదు, బైక్ స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు మాట్లాడుతూ.. సర్కిల్ పరిధిలో ఎవరైనా అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడితే శాఖపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు.