ప్రకాశం జిల్లా కొండపి మండలం అనకర్లపూడి గ్రామ సమీపంలో సోమవారం ఆర్టీసీ బస్సు కిందపడి ఓ దిచక్రవాహనదారుడు మృతి చెందాడు. మృతుడు కొండపికి చెందిన గంగాధర్ అనే వ్యక్తిగా స్థానికులు గుర్తించారు. కొండపి నుంచి చిలుకూరుకు వెళ్తున్న క్రమంలో ద్విచక్ర వాహనం అదుపుతప్పి ఆర్టీసీ బస్సు వెనక టైర్ కింద పడ్డాడు. దీంతో అక్కడికక్కడే అతను మృతి చెందగా జరిగిన ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.