డిప్యూటీ DM&HO క్రాంతి కుమార్ ఆధ్వర్యంలో ఎదిర వైద్య సిబ్బంది ప్రజలకు నేడు శనివారం రోజున మధ్యాహ్నం 12 గంటలకు వాగులు దాటి వైద్యసేవలను అందించారు. ములుగు జిల్లా వెంకటాపురం మండల పరిధిలోని సీతారాంపురం గ్రామానికి వెళ్లాలంటే అడవిలో వాగులు, వంకలను దాటుకుంటూ కాలినడకన వెళ్లాల్సిందే. పలు కష్టనష్టాలకు ఓర్చి గ్రామానికి చేరుకున్న వైద్యసిబ్బంది గ్రామస్తులకు వైద్య పరీక్షలు నిర్వహించి మందులు అందించి, వర్షాకాలంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించారు. ఈ కార్యక్రమంలో వైద్యాధికారులు మనోహర్, కోటిరెడ్డి, రఘు, మోహన్ కృష్ణ, రాజేశ్ పాల్గొన్నారు.