షాబాద్ మండల పరిధిలోని అంతారం గ్రామంలో పురుగుల మందు తాగి చికిత్స పొందుతూ మంగళవారం మధ్యాహ్నం 3:00 గంటల సమయంలో వ్యక్తి మృతి చెందాడు. పోలీసులు తెలిపిన వివరాలు ప్రకారం అంతారం గ్రామానికి చెందిన నరసింహులు వయసు 36 కూలి పని చేస్తూ సాగించేవాడు. కాగా కొన్ని రోజుల క్రితం ఓ ఇంట్లో కోడిని దొంగతనం చేసేందుకు వెళ్ళగా వారు పట్టుకున్నారు. విషయం బయటపడడంతో భయపడి పురుగుల మందు తాగి ఆత్మహత్య ప్రయత్నం చేశాడు.