కడప జిల్లా ప్రొద్దుటూరులో శుక్రవారం సాయంత్రం కురిసిన కొద్దిపాటి వర్షానికే గాంధీ రోడ్డు ప్రధాన రహదారులు జలమయమవడం చెరువులను తలపించడంతో పాదచారులు, వాహనదారులు ఇబ్బందులకు గురవుతున్నారు. శుక్రవారం సాయంత్రం కురిసిన వర్షానికి మహత్మాగాంధీ నడిచిన ప్రదేశం గాంధీ రోడ్డు లో వర్షం నీరు చేరి ఆ ప్రాంతమంతా నీటి కుంటను తలపించింది. నీరు వెళ్లే దారి లేక అక్కడే నిల్వ ఉండడంతో ఆ లోతును గమనించిన వాహనదారులు, పాదచారులు ఇబ్బందులకు గురయ్యారు..