సంగారెడ్డి జిల్లా పుల్కల్ మండలం సింగూరు గ్రామంలో కొలువుదీరిన శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారి 38వ కళ్యాణం మహోత్సవ వారోత్సవాలు ఆదివారం నుండి ప్రారంభం కానున్నాయని ఆలయ అర్చకులు శనివారం సాయంత్రం ఐదు గంటల సమయంలో తెలియజేశారు. ఆదివారం నుండి నాలుగు రోజులపాటు కొనసాగనున్న ఈ మహోత్సవాలు బుధవారం స్వామివారి చక్రవర్తి తెప్పోత్సవంతో ముగియనున్నాయి. స్వామి వారి కళ్యాణాన్ని వీక్షించేందుకు భక్తుల కోసం సింగూరు ప్రాజెక్టు వరకు బస్సు సౌకర్యాన్ని కూడా కల్పించనున్నట్లు ఆలయ అర్చకులు తెలిపారు. దీంతో భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై స్వామి వారిని దర్శించుకునే అవకాశం ఉంది.