తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మంగా ప్రవేశపెట్టిన వందరోజుల కార్యచరణలో భాగంగా మంగళవారం పరిగి మండల కేంద్రంలోని నంబర్ వన్ జడ్పీహెచ్ఎస్ పాఠశాల విద్యార్థులకు మున్సిపల్ కమిషనర్ వెంకటయ్య ఆధ్వర్యంలో తడి చెత్త పొడి చెత్త పై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. అదేవిధంగా విద్యార్థులకు వ్యాసరచన పోటీ చిత్రలేఖనము ఉపన్యాస పోటీలు నిర్వహించి విద్యార్థులకు బహుమతులు ప్రధానం చేశారు.