జిల్లాలో బెల్ట్ షాపులను వెంటనే మూసివేయాలని కల్లుగీత కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నరసింహమూర్తి డిమాండ్ చేశారు. సోమవారం కొవ్వూరులో జరిగిన కల్లుగీత కార్మిక సంఘం సమావేశంలో ఆయన మాట్లాడుతూ, కార్మికులకు ఆదరణ పథకాన్ని పునరుద్ధరించాలని కోరారు. ఈనెల 19న కొవ్వూరులో జరిగే కల్లుగీత కార్మిక సంఘం మహాసభను జయప్రదం చేయాలని ఆయన పిలుపునిచ్చారు.