అనంతపల్లి సెంటర్ వద్ద శనివారం రాత్రి రెండు వర్గాల మధ్య ఘర్షణ చెలరేగింది. ఒకరిపై ఒకరు దాడులు చేసుకోవడంతో నల్లజర్ల సర్కిల్ ఇన్స్పెక్టర్ బాలసౌరి తన సిబ్బందితో కలిసి సంఘటన స్థలానికి చేరుకుని ఇరువర్గాలను చెదరగొట్టారు. జిల్లా ఎస్పీ నరసింహ కిషోర్ ఆదేశాల మేరకు ఫోర్ డిఎస్పి దేవ్ కుమార్ బలగాలను తన సిబ్బందితో మోహరించడం జరిగింది. ఘర్షణకు గల కారణాలను పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.