నల్లగొండ జిల్లా దేవరకొండ నియోజకవర్గం గుడిపల్లి మండలం లోని భీమనపల్లి గ్రామంలో బుధవారం ఉదయం విస్తృతంగా ఎమ్మెల్యే బాలు నాయక్ పర్యటించారు .ఈ సందర్భంగా గ్రామ ప్రజలను నేరుగా కలిసి గ్రామంలోనే నెలకొన్న సమస్యలపై ఆరా తీశారు. ప్రజల సమస్యలను పరిష్కరించేందుకు అధికారులు అందుబాటులో ఉండాలన్నారు. ప్రభుత్వ పాఠశాలలో సందర్శించారు ప్రభుత్వ పాఠశాలలోని మౌలిక వసతులపై ఆరా తీశారు. ప్రభుత్వ పాఠశాలలోని విద్యార్థులకు మెరుగైన విద్యను అందించాలని సూచించారు.