రైతు సమస్యలపై ఈనెల 9 న అనంతపురం జిల్లా కేంద్రంలో జరిగే రైతు పోరు కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఏపిఐఐసి మాజీ చైర్మన్, వైఎస్సార్సీపీ నియోజకవర్గ ఇన్చార్జి మెట్టుగోవిందరెడ్డి పిలుపునిచ్చారు. ఆదివారం సాయంత్రం రాయదుర్గం పట్టణంలోని ఆయన క్యాంపు కార్యాలయంలో రైతు పోరు పోస్టర్లు విడుదల చేశారు. అనంతరం సన్నాహక సమావేశాన్ని నిర్వహించారు. నియోజకవర్గ వ్యాప్తంగా రైతులు పెద్ద ఎత్తున తరలిరావాలని కోరారు.