అమలాపురం పట్టణ కేంద్రం అమలాపురంలోని స్థానిక బుచ్చయ్య అగ్రహారం వద్ద చంద్రమౌళి అనే వ్యక్తి స్కూటీ లో వెళుతూ ఉండగా బ్రేకు వద్ద ఒక్కసారిగా పామును గమనించాడు. వెంటనే భయంతో అకస్మాత్తుగా బ్రేక్ వేయడంతో కింద పడిపోయాడు. భీమనపల్లికి చెందిన స్నేక్ కేచర్ గణేష్ వర్మకు సమాచారం అందించగా అతను వచ్చి స్కూటీ ముందు భాగాన్ని విప్పించి, అందులో దూరిన పాము పిల్లను జాగ్రత్తగా బయటకు తీసి సుదూర ప్రాంతంలో వదిలిపెట్టారు.