నల్లగొండ జిల్లా శాలిగౌరారం మండలంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో వాటర్ ప్లాంట్ ను ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి ఎమ్మెల్యే మందుల సామేలు మంగళవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా శాలిగౌరారం ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని సూచించారు. ఎమ్మెల్యే ఎంపీ మాట్లాడుతూ శాలిగౌరారం మండలాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తామని తెలిపారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని నూతన భవన నిర్మాణం కోసం కృషి చేస్తామని తెలిపారు.