ఆన్లైన్ బెట్టింగ్స్, బెట్టింగ్ యాప్స్, సైబర్ క్రైమ్ పై అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని ఎస్పీ జానకి షర్మిల అన్నారు. నిర్మల్ జిల్లా పోలీస్ కార్యాలయంలో మంగళవారం పోలీస్ అధికారులతో నెల వారి నేర సమీక్షా సమావేశం నిర్వహించారు. జిల్లాలో నేరాలను అరికట్టడమే ప్రధాన లక్ష్యంగా కఠిన చర్యలు చేపట్టాలని, ట్రాఫిక్ నియంత్రణపై ప్రత్యేక దృష్టి సారించాలని, రోడ్లపై వాహన రద్దీ తగ్గేలా చూడాలన్నారు. ఇండ్లలో జరిగే దొంగతనాలు ప్రజలకు ఆర్థికంగా నష్టం కలిగిస్తున్నాయని, వాటిని నివారించేందుకు కఠిన చర్యలు తీసుకోవాలని సూచించారు. వాహనాలు ముమ్మరంగా తనిఖీలు చేపట్టాలని మద్యం తాగి వాహనాలను నడిపే వాహనదారులపై కేసు