పల్నాడు జిల్లా వినుకొండ నియోజకవర్గం శావల్యాపురం మండలం కారుమంచి గ్రామంలో వినాయక నిమజ్జనం సందర్భంగా జరిగిన ఘర్షణలో అవినాష్ అనే వ్యక్తి పై పోలీసులు కేసు నమోదు చేశారు. కేసు పెట్టిన క్రమంలో భాగంగా తండ్రి అంకమ్మరావు శనివారం రాత్రి గుండెపోటుతో మరణించినట్లుగా బంధువులు తెలిపారు. విషయం తెలుసుకున్న నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు ఆదివారం మధ్యాహ్నం 3 గంటల సమయంలో వారి కుటుంబాన్ని పరామర్శించారు.