మెదక్ జిల్లా నర్సాపూర్లో యూరియా కోసం రైతుల తిప్పలు కొనసాగుతున్నాయి. వారం పది రోజులుగా యూరియా సరిగా అందక కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నామని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు మంగళవారం ఉదయం నుండి వ్యవసాయ కార్యాలయం వద్దకు పెద్ద ఎత్తున తరలివచ్చిన రైతులు క్యూ లైన్ లలో నిలబడి ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.