ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు కార్యక్రమం పేద ప్రజలకు అండగా నిలుస్తుంది ఎమ్మెల్సీ కొణిదల నాగేంద్రబాబు తెలియజేశారు. కాకినాడ జిల్లా పిఠాపురంలో శుక్రవారం మధ్యాహ్నం 1గంటకు కొణిదెల నాగేంద్రబాబు పర్యటన చేశారు. ముందుగా పిఠాపురం జగ్గయ్య చెరువు కాలనీలో నూతనంగా మంజూరైన పెన్షన్లు పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు. జగ్గయ్య చెరువు కాలనీలో లబ్ధిదారులు ఇంటికి వెళ్లి నేరుగా పెన్షన్ పంపిణీ చేపట్టారు. అనంతరం లబ్ధిదారులతో నాగేంద్రబాబు మాట్లాడారు. ఈ సందర్భంగా లబ్ధిదారులు ఉద్దేశించి ఎమ్మెల్సీ కొణిదల నాగేంద్రబాబు ప్రసంగించారు.