జడ్చర్ల మండలం పెద్దదిరాళ్ల గ్రామంలో రైతులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి పోస్ట్ కార్డులు రాశారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక రైతులకు 2 లక్షల రుణమాఫీ తో పాటు 15 వేల రైతు భరోసా మరియు 200 యూనిట్ల ఉచిత విద్యుత్ అమలు చేయకపోవడంతో వెంటనే వాటిని అమలు చేయాలని గ్రామానికి చెందిన రైతులు ప్రత్యేకంగా పోస్ట్ కార్డుల ద్వారా లెటర్ లు రాసి ముఖ్యమంత్రికి పంపించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీలను వెంటనే నెరవేర్చి రైతాంగాన్ని ఆదుకోవాలని వారు కోరారు.