కళ్యాణదుర్గం పట్టణానికి చెందిన శ్రీకాంత్ అనే వ్యక్తి ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన ఆదివారం మధ్యాహ్నం చోటుచేసుకుంది. శ్రీకాంత్ ఇంటిలో ఉరి వేసుకుని తనువు చాలించాడు. గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు శ్రీకాంత్ మృతదేహాన్ని పరిశీలించారు. ఆత్మహత్యకు గల కారణాలు తెలియరాలేదు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. పోలీసులు దర్యాప్తు చేపట్టారు.