వినాయక చవితి నిమజ్జనం సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చేసుకోకుండా కమిటీ నిర్వాహకులు తగిన చర్యలు తీసుకోవాలని రూరల్ సీఐ శ్రీనివాసులు రెడ్డి కోరారు. బండి ఆత్మకూరు ఎస్సై జగన్మోహన్ ఆధ్వర్యంలో గురువారం నిమజ్జనం ఉత్సవ ఏర్పాట్లపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. నిమజ్జనంలో ఎలాంటి అపశ్రుతులు చోటు చేసుకోకుండా జాగ్రత్తలు పాటించాలని విజ్ఞప్తి చేశారు. డీజేలు పెట్టొద్దని హితవు పలికారు.