రంగారెడ్డి జిల్లా చేవెళ్ల సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో తండ్రి కూతురు మృతి చెందారు. ఈ సందర్భంగా సోమవారం తెలిసిన వివరాల ప్రకారం తండ్రి కూతురు కృపను తోల్కట్ట సమీపంలోని తెలంగాణ సోషల్ వెల్ఫేర్ గురుకుల పాఠశాల నుంచి ఇంటికి తీసుకు వెళుతున్న క్రమంలో ప్రమాదం సంభవించింది ప్రమాదంలో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందగా, మృతులు వికారాబాద్ జిల్లా కోటిపల్లి మండలం బీరెల్లి తండాకు చెందిన రవీందర్ కృప గా గుర్తించారు.