పల్నాడు జిల్లా నరసరావుపేట నియోజకవర్గం నరసరావుపేట మండలం కోటప్పకొండపై వేంచేసి ఉన్న త్రికోటేశ్వరుని ఆలయం సోమవారం ఉదయం 9 గంటలకు తిరిగి తెరుచుకుంటుందని ఆలయ అర్చకులు కిరణ్ ఆదివారం సాయంత్రం 6 గంటల సమయంలో పేర్కొన్నారు. చంద్రగ్రహణం కారణంగా పౌర్ణమి పూజలను వైభవంగా నిర్వహించి ఆలయాన్ని మధ్యాహ్నం నుంచి మూసివేసినట్లుగా తెలియజేశారు సంప్రోక్షణ అనంతరం స్వామి దర్శనానికి భక్తులను అనుమతించడం జరుగుతుందన్నారు. అభిషేక కార్యక్రమాలు యధావిధిగా జరుగుతాయని తెలియజేయడం జరిగింది.