శ్రీ సత్య సాయి జిల్లా కదిరి నియోజకవర్గం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వివిధ విభాగాలకు సంబంధించి అధ్యక్షులు నియమితులు కాగా వారిని శనివారం పట్టణంలోని వైసీపీ కార్యాలయంలో వైసీపీ పట్టణ అధ్యక్షుడు షేక్ బాబ్జాన్ ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు. కదిరి వైసిపి సమన్వయకర్త మక్బూల్ అహ్మద్ ఆదేశాలతో రాష్ట్ర అధినాయకత్వం వివిధ విభాగాల అధ్యక్షులను నియమించగా, పార్టీ కోసం, ప్రజా సమస్యలపై పోరాడుతామని తెలియజేశారు.