రాయచోటి పట్టణ పరిధిలో ఇంటింటా చెత్త సేకరణ, తడి – పొడి చెత్త వేరు వేరు చేయడం, సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వినియోగం తగ్గించాలనే అంశాలపై గురువారం మున్సిపల్ కమిషనర్ శ్రీ రవి పరిశీలించారు. పట్టణంలోని పలు కాలనీల్లో స్వయంగా ఇంటింటికీ వెళ్ళి చెత్త సేకరణ ప్రక్రియను పరిశీలించి, ప్రజలతో మాట్లాడారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... ప్రతి గృహం నుంచి చెత్త వాహనాలకు తడి – పొడి చెత్త వేరు వేరుగా ఇవ్వడం తప్పనిసరి. పరిశుభ్రత అంటే కేవలం మున్సిపాలిటీ పని కాదు, ప్రజలందరి సహకారంతోనే సాధ్యం. సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వినియోగం తగ్గించకపోతే పర్యావరణానికి భారీ నష్టం జరుగుతుంది అని అన్నారు.