అల్లూరి జిల్లా పాడేరు మండలం గుత్తులు పుట్టును మండల కేంద్రంగా ప్రకటించాలంటే డిమాండ్ చేస్తూ సోమవారం మధ్యాహ్నం రెండు గంటల సమయంలో పాడేరు పట్టణంలో స్థానిక గిరిజనులు భారీ ర్యాలీ నిర్వహించారు. గుత్తులు పుట్టు పరిసర గ్రామాలకు చెందిన 500 మందికి పైగా గిరిజనులు పాడేరు పట్టణంలో అంబేద్కర్ కూడలి వద్ద నుండి ఐటీడీ వద్ద వరకు ఈ ర్యాలీని నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మండల కేంద్రంగా ప్రకటించేందుకు అన్ని వసతులు ఉన్న తమ గ్రామాన్ని మండలంగా ప్రకటించాలని కోరారు.