అమెరికా పన్నుల పెరుగుదలపై పుట్టపర్తి గణేశ్ సర్కిల్లో శనివారం మధ్యాహ్నం నిరసన తెలిపారు. అమెరికా నుంచి దిగుమతులకు ఎలాంటి సుంకం లేదని, ఎగుమతులపై 50శాతం సుంకాలు మోపుతున్నా కేంద్ర ప్రభుత్వం ఎందుకు నోరు మెదపలేదని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు రాంభూపాల్ అన్నారు. రష్యా నుంచి కేంద్రం ఆయిల్ దిగుమతి చేసుకుంటే అది అదానీ, అంబానీలకు మేలు జరిగిందని, ప్రజలకు ఎలాంటి ఫలితం లేదని విమర్శించారు.