యాదాద్రి భువనగిరి జిల్లా: హైదరాబాద్ నేషనల్ హైవే అథారిటీస్ ప్రాజెక్టు డైరెక్టర్ దుర్గాప్రసాదను సిబిఐ అధికారులు అరెస్టు చేశారు.బిబినగర్ టోల్ ప్లాజు పక్కన రెస్టారెంట్ నిర్వహిస్తున్న యాజమాన్యం నుంచి 60 వేలు లంచం తీసుకుంటుండగా అధికారులు ఆయనను పట్టుకున్నారు. హైవే పక్కన రెస్టారెంట్ నడుపుతున్నందుకు లక్ష డిమాండ్ చేసిన స్థానికులు తెలిపారు. హైదరాబాద్ వరంగల్ సదాశివపేటలోని దుర్గాప్రసాద్ ఇల్లు ఆఫీసుల్లో సిబిఐ అధికారులు సోదాలను నిర్వహించారు.