నల్లగొండ జిల్లా కేంద్రంలోని యూరియా కొరతపై బిజెపి ఆధ్వర్యంలో రైతులు ఆందోళన చేపట్టారు. రైతులకు సరిపడా యూరియా లభించకపోవడంతో వారు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా బుధవారం నల్గొండ పట్టణంలోని నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. రాష్ట్ర ప్రభుత్వం యూరియా అందించకుండా రైతులను ఇబ్బందులకు గురిచేస్తుందని బిజెపి నల్లగొండ నియోజక వర్గ నాయకులు పిల్లి రామరాజు యాదవ్ అన్నారు .యూరియా లేకపోవడంతో పంటలు ఎండిపోతున్నాయని, ఆవేదన వ్యక్తం చేశారు .తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం స్పందించి యూరియాను సరఫరా చేయాలని డిమాండ్ చేశారు.