తూర్పుగోదావరి జిల్లా దేవరపల్లి పోలీస్ స్టేషన్ సమీపంలో శనివారం ఉదయం లారీ ఢీకొని రామన్నపాలెం సర్పంచ్ కూచిపూడి బొల్లారావు మృతి చెందారు. ఆయన ప్రయాణిస్తున్న ద్విచక్ర వాహనాన్ని టిప్పర్ లారి ఢీకొనడంతో ఈ ప్రమాదం సంభవించిందని దేవరపల్లి పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.