బాలానగర్లో సివిల్ సప్లై ఏఎస్ఓ అధికారిని కలిసి కాంగ్రెస్ నేతలు వినతిపత్రం సమర్పించారు. అర్హులైన నిరుపేదలకు సకాలంలో రేషన్ కార్డులో ఇవ్వాలని కోరారు. గ్రామపంచాయతీ ఎన్నికల కోడ్ అమల్లోకి రాకముందే పెండింగ్ కార్డులు మంజూరు చేయాలన్నారు. గత బిఆర్ఎస్ ప్రభుత్వం 10 ఏళ్లలో ఒక్క రేషన్ కార్డు ఇవ్వకపోవడం సిగ్గుచేటని విమర్శించారు. ప్రజా ప్రభుత్వంలో పేదలకు న్యాయం జరుగుతోందని తెలిపారు.