యాదాద్రి భువనగిరి జిల్లా: భువనగిరి పట్టణంలోని గణేష్ నిమజ్జన ఏర్పాట్లను ఎమ్మెల్యే కుంభ అనిల్ కుమార్ రెడ్డి శుక్రవారం పరిశీలించారు. ఈ సందర్భంగా పట్టణంలోని పెద్ద చెరువు వద్ద వేసిన ఏర్పాట్లను ఆయన సమీక్షించారు. నిమజ్జనం కార్యక్రమం సజావుగా సాగిలా చూడాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధికారులు కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.