నిర్మల్ జిల్లా బాసర శ్రీ జ్ఞాన సరస్వతి ఆలయంలో శ్రావణ మాసం చివరి శుక్రవారం కావడంతో దేవస్థానంలో ఆలయ స్థానాచార్యులు ప్రవీణ్ పాఠక్ ఆధ్వర్యంలో సామూహిక కుంకుమార్చన పూజలను ఘనంగా నిర్వహించారు. అంతకు ముందు అమ్మవారి ఆలయంలో వైదిక బృందం అమ్మవారి విగ్రహానికి ప్రత్యేక అభిషేకాలు నిర్వహించి అమ్మవారికి పట్టువస్త్రాలతో రంగురంగుల గాజులు తొడిగి పూల మాలలతో ప్రత్యేకంగా అలంకరించి అమ్మవారిని వేదోక్తంగా అర్థించారు. అనంతరం ముత్తైదువులతో కుంకుమార్చన పూజలను నిర్వహించారు. ఈ సందర్భంగా ముత్తైదువులు ఒకరినొకరు వాయినాలు ఇచ్చుకొని అమ్మవారిని దర్శించుకున్నారు.