గ్రామాల్లో అభివృద్ధి పనులను వేగవంతం చేయాలని ఏపిడి నాగవర్ధన్ అన్నారు. శనివారం దస్తురబాద్ మండలకేంద్రంలో నిర్మిస్తున్న సామూహిక ఇంకుడు గుంత నిర్మాణ పనులను వారు పరిశీలించారు. అలాగే పనులకు వెను వెంటనే రికార్డు చేయాలను సూచించారు. అనంతరం ఎంపీడీవో కార్యాలయంలో సమావేశాన్ని నిర్వహించారు. మండలంలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులపై,అంగన్వాడీ కేంద్రాల మరమ్మతుల పనులపై,ఫిష్ ఫామ్ నిర్మాణాలపై చర్చించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో సునీత,ఎంపీఓ రమేష్ రెడ్డి, ఎపిఓ రవిప్రసాద్, ఏపీఎం రమేష్ తదితరులు పాల్గొన్నారు.