హుజురాబాద్: పట్టణంలోని వ్యవసాయ సహకార సంఘం వద్ద వారం రోజుల నుండి రైతులు యూరియా కోసం ఎదురుచూస్తున్నామని అయినా యూరియా రావడం లేదని ఆగ్రహించిన రైతులు స్థానిక వ్యవసాయ కార్యాలయం వద్దకు బుధవారం సాయంత్రం చేరుకొని గేటు ముందు బైఠాయించారు అనంతరం మండల వ్యవసాయ అధికారి భూమి రెడ్డిని అడ్డుకొని నిలదీశారు వారం రోజుల నుండి యూరియా కోసం సొసైటీ చుట్టూ తిరుగుతున్నామని అయినా యూరియా దొరకక పంటలు ఎండిపోతున్నాయని వాపోయారు వెంటనే తమకు యూరియా ఇప్పించాలని పట్టుబడ్డారు రెండు రోజుల్లో వస్తుందని వచ్చాక తప్పకుండా ఇస్తామని చెప్పడంతో రైతులు శాంతించారు.