రాజనగరం మండలం భూపాలపట్నం సొసైటీలో యూరియా విక్రయాలను తాత్కాలికంగా నిలిపివేశారు. విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ సర్కిల్ ఇన్స్పెక్టర్ మధుబాబు ఆధ్వర్యంలో సోమవారం రాత్రి జరిగిన తనిఖీల్లో యూరియా నిల్వలకు, రికార్డులో ఉన్న లెక్కలకు పొంతన లేకపోవడానికి అధికారులు గుర్తించారు. దీంతో సుమారు 19,00,000 విలువ చేసే యూరియా అమ్మకాలను తాత్కాలికంగా నిలిపివేసినట్లు సిఐ తెలిపారు.