Rampachodavaram, Alluri Sitharama Raju | Aug 28, 2025
చింతూరు డివిజన్ పరిధిలో విలీన మండలాలను మళ్లీ వరదలు చుట్టుముట్టాయి గత మూడు రోజులుగా ఎడతెరిపి లేకుండా వర్షాలు పడుతుండటంతో విలీన మండలాల మధ్య రాకపోకలు నిలిచిపోయాయి.చింతూరు వద్ద శబరి నది 38 అడుగులతో ఉదృతంగా ప్రవహిస్తుంది.సోకులేరు వాగు, చంద్రవంక వాగు, కుయుగూరు వాగు, అత్త కోడలు వాగు రహదారిపై ప్రవహిస్తూ ఉండడంతో చింతూరు నుండి విఆర్ పురం వెళ్లే సుమారు 15 గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి.326 జాతీయ రహదారిపై పూర్తిగా వరద నీరు చేరడంతో ఆంధ్ర ఒడిస్సా రాకపోకలు నిలిచిపోయాయి. చింతూరులోని శబరి ఒడ్డు గ్రామస్తులను పునరవాసాల కేంద్రాలకు తరలి వెళ్లాలని అధికారులు ఆదేశాలు జారీచేశారు.