ఆర్ఎస్ఎస్ ఫాసిస్టు సంస్థ అని ఉండవల్లి అరుణ్ కుమార్ నోటికి వచ్చినట్లు మాట్లాడడం సరికాదని ఎమ్మెల్సీ సోము వీర్రాజు మండిపడ్డారు. జీఎస్టీ తగ్గింపు మరియు ఉపరాష్ట్రపతిగా రాధాకృష్ణన్ విజయం సందర్భంగా రాజమండ్రి బిజెపి కార్యాలయంలో బుధవారం సంబరాలు జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న సోము వీర్రాజు మాట్లాడుతూ, ఉండవల్లి అరుణ్ కుమార్ బహిరంగ చర్చకు రావాలని సవాల్ విసిరారు.