ఉపాధ్యాయుల న్యాయమైన డిమాండ్ల సాధన కోసం ఈ నెలలో జరగనున్న అసెంబ్లీ సమావేశాలలో రాష్ట్ర గిరిజన అభివృద్ధి, స్త్రీ శిశు సంక్షేమ శాఖల మంత్రి గుమ్మిడి సంధ్యారాణి చర్చించాలంటూ APTF నాయకులు, ఉపాధ్యాయులు వినతి పత్రాన్ని అందజేశారు. పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు పట్టణంలోని మంత్రి క్యాంప్ కార్యాలయానికి శనివారం సాయంత్రం చేరుకున్న ఏపీటీఎఫ్ రాష్ట్ర కౌన్సిలర్ ముక్తేశ్వర పాణిగ్రాహి, జిల్లా కార్యదర్శి గౌరీశంకర్, సహాధ్యక్షుడు నాయుడు ప్రభాకర్, లావుడు వెంకటేశ్వరరావు తదితరులు మంత్రి కార్యాలయానికి చేరుకున్నారు. మంత్రి అందుబాటులో లేకపోవడంతో ప డిమాండ్లతో కూడిన వినతి పత్రం పీఏకు అందించారు.