ఏలూరు జిల్లా టి.నర్సాపురం మండలం బండివారిగూడెం గ్రామ శివారులో గురువారం తెల్లవారుజామున ఓ లారీ బోల్తా పడింది. బుధవారం రాత్రి కురిసిన వర్షానికి రహదారి దెబ్బతిని కోతకు గురైంది. రోడ్డు పాడవడంతో జామాయిల్ లోడ్తో వెళ్తున్న లారీ రోడ్డు కోతకు గురైన ప్రాంతంలో కుంగి బోల్తా పడింది. డ్రైవర్ స్వల్ప గాయాలతో బయటపడ్డాడు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని ట్రాఫిక్ను నియంత్రించారు