ఎడ్లంక దీవిలో నది కోత సమస్యకు శాశ్వత పరిష్కార మార్గాల ప్రతిపాదనలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళతామని సెంట్రల్ డిజైన్స్ ఆర్గనైజేషన్ సీఈ ఏ. విజయ్ భాస్కర్ తెలిపారు. గురువారం సెంట్రల్ డిజైన్స్ ఆర్గనైజేషన్ అధికారులు అవనిగడ్డ మండలంలోని ఎడ్లంక దీవి చుట్టూ నెలకొన్న నది కోత సమస్యను పరిశీలించారు. ఇటీవల పలు ఇళ్ళు, చెట్లు, గుడి నదిలో కొట్టుకుపోయిన ప్రదేశాలను వారు పడవలో తిరిగి పరిశీలించారు