ద్విచక్రవాహనాన్ని కారు ఢీకొన్న ప్రమాదంలో దంపతులకు తీవ్రంగా గాయాలైన ఘటన వాజేడు మండలంలో నేడు మంగళవారం రోజున ఉదయం 10 గంటలకు జరిగింది. స్థానికుల వివరాల ప్రకారం... ప్రగల్లపల్లి గ్రామ శివారులో ఏటూరునాగారం వెళుతున్న రాము దంపతులను కారు ఢీకొంది. ఈ ప్రమాదంలో ఇద్దరు గాయపడ్డారు. వారిని 108 ద్వారా వెంకటాపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందించి, మెరుగైన వైద్యం కోసం ములుగు ఏరియా ఆసుపత్రికి తరలించారు.