వికారాబాద్ జిల్లా పూడూరు మండల నూతన తహసిల్దార్ గా నేడు సోమవారం విజయ్ కుమార్ పదవీ బాధ్యతలు స్వీకరించారు. గతంలో పూడూరు మండల తహసిల్దార్ గా విధులు నిర్వహించిన భరత్ గౌడ్ కలెక్టరేట్ కు బదిలీ కావడంతో ఆయన స్థానంలో కొడంగల్ తాసిల్దారుగా విధులు నిర్వహించిన విజయ్ కుమార్ బదిలీపై రావటం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మండలంలో రెవెన్యూ సమస్యల పరిష్కారానికి తన వంతు కృషి చేస్తానని మండల ప్రజలు సహకరించాలని కోరారు.