జిల్లాలో అతిసార వ్యాధి నియంత్రణలో ఉందని జిల్లా కలెక్టర్ ఏ తమీమ్ అన్సారియా తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్ శుక్రవారం సాయంత్రం జిల్లా కలెక్టర్ లతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ లో జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో ఇప్పటి వరకు 177 కేసులు నమోదు అయ్యాయన్నారు. గుంటూరు పట్టణం నుండి 152 కేసులు రాగా, గ్రామీణ ప్రాంతం నుండి 25 కేసులు నమోదు అయ్యాయని చెప్పారు. వివిధ ప్రాంతాల నుండి కేసులు నమోదు అయ్యాయని, ఆయా ప్రాంతాలకు ప్రత్యేక అధికారులను నియమించి నిశితంగా పర్యవేక్షణ చేస్తున్నామని అన్నారు.