కోడూరు మండలం నరసింహపురం గ్రామానికి చెందిన చింతా వెంకట్రావు బుధవారం పొలం వెళ్లి గడ్డి కోస్తుండగా ఎడమ చేయి మధ్య వేలుకు పాము కాటు వేసింది. వెంటనే అతన్ని అవనిగడ్డ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా, అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. కోడూరు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.