కరప గ్రామపంచాయతీలో స్వచ్ఛ ఆంధ్ర ఆవశ్యకతపై శనివారం అవగాహన ర్యాలీ నిర్వహించారు గ్రామ కార్యదర్శి నిర్మల దేవి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో టిడిపి జనసేన నాయకులతో పాటు అంగన్వాడీలు ఆశ వర్కర్లు పాల్గొన్నారు. దోమలను నిర్మూలిద్దాం, రోగాలు రాకుండా తమ వంతు కృషి చేద్దాం సంపూర్ణ పారిశుద్ధ్యనికి సహకరిద్దాం వంటి నినాదాలు ఇస్తూ ప్రజలకు పరిశుభ్రత పై అవగాహన కల్పించారు.