గురువారం రోజున మల్కాజిగిరి ఆర్కేపురంలో గంజాయిపై ఉక్కుపాదం మోపుతున్న పోలీసులు ముగ్గురు ఆటో డ్రైవర్లను రెడ్్యండెడ్గా పట్టుకున్నారు. DTF టీం దాడులు చేసి నందకిశోర్, వంశీ, అఖిల్ను అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి 2.2 కేజీల గంజాయి, మూడు సెల్ ఫోన్లు, ఒక ఆటో సీజ్ చేశారు. మహారాష్ట్ర నుంచి గంజాయి తెచ్చి అమ్మకాలు చేస్తున్నట్లు వెల్లడైంది. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.