తిరుపతి జిల్లా సూళ్లూరుపేటలోని సాయి నగర్ లో నివాసం ఉంటున్న బాబుపై గుర్తుతెలియని వ్యక్తులు గురువారం దాడి చేశారు. చిన్నసత్రంలోని మసీదుకు వెళ్తుండగా గుర్తుతెలియని కొందరు వచ్చి దాడికి పాల్పడినట్టు బాధితుడు బాబు తెలిపాడు. మద్యం మత్తులో దుండగులు దాడికి చేసినట్లు అనుమానం వ్యక్తం చేశారు. ఈ దాడిలో బాబుకు తల వెనుక భాగంలో తీవ్ర గాయాలు అయ్యాయి. గమనించిన స్థానికులు అతన్ని వైద్యశాలకు తరలించారు. ఈ మేరకు క్షతగాత్రుడు బాబు పోలీసులకు ఫిర్యాదు చేశారు.