పంటల సాగులో రైతులు యాజమాన్య పద్ధతులు పాటించాలని కామారెడ్డి వ్యవసాయ శాఖ ఏడీఏ అపర్ణ సూచించారు. గురువారం కామారెడ్డి జిల్లా రాజంపేట మండల కేంద్రంలో వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో పంట పొలాల వద్ద రైతులకు పలు అంశాలపై అవగాహన కల్పించారు. పంటలు చేతికి వచ్చే సమయంలో తీసుకోవలసిన జాగ్రత్తలను వివరించారు. ఈ కార్యక్రమంలో మండల వ్యవసాయ అధికారి శృతి, వ్యవసాయ సిబ్బంది పాల్గొన్నారు.