పలాసపురం గ్రామం నుంచి లక్కవరం వెళ్లే ఆర్ అండ్ బి రోడ్డు మార్గంలో ఉన్న ఎలక్ట్రికల్ పోల్స్కు పార్టీ కలర్స్ తొలగించారు. ఎలక్షన్ కమిషన్ అదేశాల మేరకు రోడ్లపై ఉన్న స్తంభాలపై, పబ్లిక్ స్థలాలలో ఉన్న పార్టీ కలర్స్, స్టిక్కర్స్ ను బుధవారం మధ్యాహ్నం 3 గంటలకు తొలగించారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి కామేష్, మహిళా పోలీస్ ధనలక్ష్మి, విఆర్ఓ పి.చంద్రకళ పాల్గొన్నారు.